![]() |
![]() |

స్టార్ బ్యూటీ సమంత నుంచి రాబోతున్న తదుపరి చిత్రం `కాత్తు వాక్కుల రెండు కాదల్`. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. తెలుగులోనూ `కణ్మణి రాంబో ఖతీజా` పేరుతో అనువాదం కానుంది. ఇందులో కణ్మణిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుండగా.. రాంబోగా వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, ఖతీజాగా సామ్ దర్శనమివ్వనున్నారు. నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూపొందించిన ఈ క్రేజీ స్టారర్.. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కింది.
Also Read: మేలో 'రంగ రంగ వైభవంగా' వచ్చేస్తున్న మెగా హీరో!
ఇదిలా ఉంటే, `కాత్తు వాక్కుల రెండు కాదల్` తాలూకు టీజర్ ని నిన్న (ఫిబ్రవరి 11) సాయంత్రం రిలీజ్ చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో నయన్, సామ్, విజయ్ మధ్య సాగే విజువల్స్ గిలిగింతలు పెట్టాయి. అంతేకాదు.. టీజర్ చివరలో ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కాబోతోందంటూ అనౌన్స్ చేశారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు. ఇప్పటివరకు సామ్ బర్త్ డే స్పెషల్ గా తను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరి.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ తన బర్త్ డేకి రాబోతున్న ఈ చిత్రంతో సామ్ మెమరబుల్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |