![]() |
![]() |

తండ్రీకూతుళ్లు మోహన్‌బాబు, లక్ష్మీప్రసన్న తొలిసారి కలిసి నటిస్తోన్న సినిమా నేడు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, హీరో మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మంచు విష్ణు కుమారుడు మంచు అవరామ్, లక్ష్మి కుమార్తె మంచు విద్యా నిర్వాణ స్ర్కిఫ్ట్ అందజేసారు.
మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించే ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం సంగీతం సమకూరుస్తుండగా, సాయిప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ - “ఇది ఒక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు.

![]() |
![]() |