![]() |
![]() |

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'కొండపొలం' సినిమాతోనూ మెప్పించిన వైష్ణవ్.. త్వరలో తన మూడో సినిమా 'రంగ రంగ వైభవంగా'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన 'ఆదిత్య వర్మ' డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్, కేతిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాకి మే 27 న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకి రెండు వారాల ముందు మే 12 న మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' విడుదల కానుంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 'రంగ రంగ వైభవంగా' సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి సంగీతం అందించిన వైష్ణవ్ మొదటి సినిమా ఉప్పెన సంచలన విజయం సాధించింది. ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |