![]() |
![]() |

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయి. వాటిలో `పవర్`, `జై లవ కుశ`, `వెంకిమామ` సినిమాల దర్శకుడు బాబీ కాంబినేషన్ లో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్ళింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
.webp)
ఇదిలా ఉంటే.. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆ మధ్య `వాల్తేర్ శీను`, `వాల్తేర్ వీరయ్య` వంటి టైటిల్స్ వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `వాల్తేర్ మొనగాడు` అనే పేరుని ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. త్వరలోనే చిరు - బాబీ కాంబో మూవీకి సంబంధించి టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: సినీ పరిశ్రమ వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలి.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా, చిరు తాజా చిత్రం `ఆచార్య` ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామాలో తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. మరోవైపు.. `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్`, `మెగా 156` వంటి సినిమాలు కూడా చేస్తున్నారు మెగాస్టార్.
![]() |
![]() |