![]() |
![]() |

2022 క్యాలెండర్ ఇయర్ లో కొంతమంది బాలీవుడ్ బ్యూటీస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ నాయికల వివరాల్లోకి వెళితే..
ఆలియా భట్ః హిందీనాట స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బాలీవుడ్ దివా ఆలియా భట్.. ఈ ఏడాది తెలుగునాట తొలి అడుగేస్తోంది. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన `ఆర్ ఆర్ ఆర్`తో ఆలియా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఎంటర్టైన్ చేయనుంది ఆలియా. వేసవి కానుకగా మార్చి 25న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఆపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ కొరటాల శివ డైరెక్టోరియల్ చేయబోతోంది.
అనన్యా పాండేః బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అందాల తార అనన్యా పాండే.. ఆలియా భట్ తరహాలోనే ఓ పాన్ - ఇండియా మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ చిత్రమే.. `లైగర్`. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఆగస్టు 25న విడుదల కానుంది.
సయీ మంజ్రేకర్ః `ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ తనయ` అనే ట్యాగ్ తో `దబాంగ్ 3` మూవీ ద్వారా బాలీవుడ్ లో తొలి అడుగేసిన సయీ మంజ్రేకర్.. ఈ సంవత్సరం తెలుగులోనూ అదృష్టం పరీక్షించుకోనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన `గని` ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న రిలీజ్ కానుండగా.. వెర్సటైల్ యాక్టర్ అడివి శేష్ కి జంటగా నటించిన `మేజర్` మే 27న విడుదల కానుంది.
మరి.. ఈ ముగ్గురిలో ఎవరెవరికి టాలీవుడ్ లో తొలి విజయం దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |