![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో అభినేత్రి రాధ ఒకరు. `అగ్ని పర్వతం`, `సింహాసనం`, `ముగ్గురు కొడుకులు` తదితర విజయవంతమైన చిత్రాల్లో ఈ ఇద్దరి జోడీ ఆకట్టుకుంది. పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన రాధ.. త్వరలో రి-ఎంట్రీ బాట పట్టనుందట. అది కూడా.. కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రంతో..!
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` వంటి కల్ట్ క్లాసిక్స్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుంది. కాగా, ఇందులో మహేశ్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాలో మహేశ్ కి తల్లిగా రాధ కనిపించనుందట. ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయని టాక్. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో రాధ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి.. `ముగ్గురు కొడుకులు` చిత్రంలో మహేశ్ కి వదిన పాత్రలో ఆకట్టుకున్న రాధ.. ఈ సారి అమ్మ పాత్రలో ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. అన్నట్టు.. 2023 సంక్రాంతికి ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |