![]() |
![]() |

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ఐఆర్'. మంచి అంచనాలతో నేడు(ఫిబ్రవరి 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. మూడు దేశాలు ఈ మూవీని బ్యాన్ చేశాయి.
మలేషియా, కువైట్, ఖతార్ దేశాల్లో 'ఎఫ్ఐఆర్' సినిమా విడుదలపై నిషేధం విధించారు. సినిమాలోని కంటెంట్ కారణంగా అక్కడ సెన్సార్ ని క్లియర్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం. టెర్రరిజంతో సంబంధం లేకపోయినా అనుకోకుండా అందులో ఇరుక్కుపోయిన ఓ ముస్లిం యువకుడి కథ ఈ సినిమా. అయితే ఈ సినిమా కంటెంట్ కారణంగా మూడు దేశాల్లో బ్యాన్ కి గురైంది.

మూడు దేశాల్లో 'ఎఫ్ఐఆర్' సినిమా బ్యాన్ కావడంపై హీరో విష్ణు విశాల్ స్పందించాడు. ఆ దేశాల్లోని ప్రేక్షకులను ఆయన ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపాడు.
![]() |
![]() |