![]() |
![]() |

'అరవింద సమేత' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేకుండా తారక్, త్రివిక్రమ్ లు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. దీంతో వీరి కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా ఆగిపోయిందని భావించారంతా. అయితే ఆ సినిమా ఆగిపోలేదని, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నామని తాజాగా నిర్మాత నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ నటించే సినిమా NTR30 హారిక హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ డైరెక్టర్ గా తెరకెక్కనుందని గతేడాది జనవరిలో అధికారిక వచ్చింది. అయితే ఆ ప్రకటన మూడు నెలలకే అంటే ఏప్రిల్ లో కొరటాల శివ డైరెక్టర్ గా NTR30 ప్రకటన వచ్చింది. దీంతో తారక్, త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, కేవలం వాయిదా పడిందని నాగవంశీ అన్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, వాయిదా పడిందని అన్నారు. ఈ సినిమాని భారీస్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. త్రివిక్రమ్ అనుకున్న ఆ సబ్జెక్ట్ తారక్ సూట్ అవుతుందని, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా అవుతుందని నాగవంశీ తెలిపారు. నాగవంశీ మాటలను బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'ని మించి ఉంటుందేమో అనిపిస్తుంది.
![]() |
![]() |