![]() |
![]() |

అనసూయ 'ఖిలాడి'లో ద్విపాత్రల్లో కనిపించనున్నారు. ఒక సినిమాలో ఆమె డ్యూయల్ రోల్ చేయడం ఇదే ప్రథమం. ఇందులో ఆమె చాందిని, చంద్రకళ అనే పాత్రలు చేశారు. చాందిని అనే పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందనీ, హీరోయిన్ డింపుల్ హయాతి తల్లి చంద్రకళగా ఆమె పాత్ర ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందనీ డైరెక్టర్ రమేశ్ వర్మ వెల్లడించారు. "సినిమాలో డింపుల్ మదర్‌గా అనసూయ ఓ క్యారెక్టర్ చేశారు. మొదట మదర్ రోల్ అని చెప్పినప్పుడు, నేను మదర్ ఏంటి, వాట్ ఆర్ యు టాకింగ్, అసలు ఏం మాట్లాడుతున్నారు? అని అసలు కథ విననే విననని చెప్పింది. అప్పుడు మా కో-డైరెక్టర్ ఒక్కసారి వినండి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ఆమె కథ విన్నారు. వినగానే బాగుంది కదా, చేస్తాను అని రెండు క్యారెక్టర్లు చేశారు. వాటిలో ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఒక చిన్న క్యారెక్టర్, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకోటి డింపుల్ మదర్ క్యారెక్టర్." అని ఆయన తెలిపారు. Also read: 'భీమ్లా నాయక్' రిలీజ్‌కు జగన్ ఓకే చెప్పినట్లేనా?
రెండు క్యారెక్టర్లు అనేసరికి, అనసూయ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారా? లేక తల్లీకూతుళ్లుగా కనిపిస్తారా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఆ విషయం సినిమా చూసే తెలుసుకోవాలని రమేశ్ వర్మ అంటారు. "నేను ఆడియెన్స్‌ను చీట్ చేయాలని అనుకోవట్లేదు. ఆవిడ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ఇదివరకు చేసిన క్యారెక్టర్స్‌తో పోలిస్తే ఆవిడ 'ఖిలాడి'లో కొత్త డైమన్షన్‌లో కనిపిస్తారు." అని ఆయన అన్నారు. Also read: రామ్ కంటే బోయపాటికే ఎక్కువ పారితోషికం!?
సినిమాలో రవితేజ, అనసూయ మధ్య వచ్చే సీన్లు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తాయని రమేశ్ వర్మ చెప్పారు. "ఆ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వాళ్ల మధ్య చిన్న ఆట లాంటిది నడుస్తుంది." అని ఆయన వెల్లడించారు.
![]() |
![]() |