![]() |
![]() |

'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'పుష్పక విమానం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'హైవే', 'బేబీ' సినిమాలు ఆనంద్ చేతిలో ఉన్నాయి. తాజాగా మరో ప్రాజెక్ట్ ని ప్రకటించాడు.
ఆనంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడు. చేతన్ భరద్వాజ్ తాజాగా ఈ సినిమాని లాంచనంగా ప్రారంభించిన మూవీ టీమ్.. 'యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్' అంటూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇదొక యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. మొదటి మూడు చిత్రాలలోనూ పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఆనంద్ ఈ యాక్షన్ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

కాగా ఆనంద్ ప్రస్తుతం 'హైవే' అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కేవీ గుహన్ దర్శకుడు. అలాగే సాయి రాజేష్ దర్శకత్వంలో 'బేబీ' లవ్ జోనర్ సినిమా కూడా చేస్తున్నాడు.
![]() |
![]() |