![]() |
![]() |

పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో తెలుగువారికి బాగా చేరువైన నేచురల్ స్టార్ నాని.. గత కొంతకాలంగా డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్నాడు. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వర్కవుట్ అయ్యాయి. మరీముఖ్యంగా.. మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` అతని కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు చిరునామాగా నిలవడమే కాకుండా హిందీలో కూడా రీమేక్ అయింది. అయితే, `జెర్సీ` తరువాత వచ్చిన `గ్యాంగ్ లీడర్`, `వి`, `టక్ జగదీశ్` చిత్రాలు నానికి అనుకున్నంతగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. క్రిస్మస్ స్పెషల్ గా ఈ నెల 24న విడుదలైన `శ్యామ్ సింగ రాయ్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు నాని. ఇందులో శ్యామ్ సింగ రాయ్, వాసుగా రెండు విభిన్న కాలాలకు చెందిన పాత్రల్లో అలరించాడు నాని. మరోసారి నటుడిగా మెస్మరైజ్ చేశాడు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రీసెంట్ టైమ్స్ లో నానికి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకురావడమే కాకుండా విజయాలు కూడా అందించిన `జెర్సీ`, `శ్యామ్ సింగ రాయ్`కి ఒక్కరే సినిమాటోగ్రాఫర్. అతనే సాను జాన్ వర్ఘీస్. కేరళకు చెందిన ఈ ఛాయాగ్రాహకుడు.. తెలుగులో ఇప్పటివరకు నేరుగా చేసిన సినిమాలు రెండే. ఆ రెండింట్లోనూ నానినే కథానాయకుడు కావడం విశేషం. మొత్తమ్మీద.. సాను జాన్ వర్ఘీస్ తన చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేసిన రెండు సందర్భాల్లోనూ నానికి మంచి ఫలితాలు దక్కాయి.
Also Read: కృష్ణంరాజు, ప్రభాస్.. ఫస్ట్ టైమ్!
మరి.. నానికి అచ్చొచ్చిన సినిమాటోగ్రాఫర్ గా తెలుగునాట ప్రత్యేక గుర్తింపు పొందిన సాను.. త్వరలోనే `హ్యాట్రిక్ కాంబో`గానూ నిలుస్తాడేమో చూడాలి.
![]() |
![]() |