![]() |
![]() |

2021లో తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల్లో కృతి శెట్టి ఒకరు. ఫిబ్రవరి సెన్సేషన్ `ఉప్పెన`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి.. అందులో పోషించిన బేబమ్మ పాత్రతో కుర్రకారు గుండె చప్పుడైపోయింది. అటుపై పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రీసెంట్ గా.. నేచురల్ స్టార్ నానికి జోడీగా `శ్యామ్ సింగ రాయ్`లో కనిపించి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ కి హీట్ పెంచిన ఈ క్యూట్ బ్యూటీ.. త్వరలో `బంగార్రాజు`తో పలకరించబోతోంది.
2016 నాటి సంక్రాంతి సంచలనం `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో కింగ్ నాగార్జునతో పాటు యువ సామ్రాట్ నాగచైతన్య కూడా మరో హీరోగా నటిస్తుండగా.. చైతూకి జంటగా దర్శనమివ్వనుంది కృతి శెట్టి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో, పాటలతో ఇంప్రెస్ చేస్తున్న ఈ సినిమా కూడా టికెట్ విండోస్ ముంగిట కాసుల సందడి చేస్తే.. మిస్ శెట్టి ఖాతాలో హ్యాట్రిక్ క్రెడిట్ అయినట్టే. మరి.. హ్యాట్రిక్ హీరోయిన్ గా కృతి శెట్టి గుర్తింపు పొందుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Aslo read:`ఢీ` షో భామ దీపిక పిల్లికి ఊహించని షాక్
కాగా, కృతి ప్రస్తుతం `మాచర్ల నియోజక వర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ - లింగుస్వామి బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది. ఇవన్నీ కూడా 2022లోనే తెరపైకి రాబోతున్నాయి.
![]() |
![]() |