![]() |
![]() |

సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ సినిమాను గంగ ఎంటర్టైన్మెంట్స్.. 'అంతఃపురం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. డిసెంబర్ 31న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
Also read: 'పుష్ప' మూవీ రివ్యూ
'అరణ్మణై' సిరీస్ తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైన 'అరణ్మణై', 'కళావతి'గా విడుదలైన 'అరణ్మణై 2' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు 'అంతఃపురం' పేరుతో 'అరణ్మణై 3' వస్తోంది. తమిళంలో 'అరణ్మణై 3'కి మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాకి రాశీ ఖన్నా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన రాశీ.. హారర్ కామెడీతో ఎలా మెప్పిస్తుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Also read: పుష్ప పార్ట్-2 టైటిల్ వచ్చేసింది!
సుందర్.సి మాట్లాడుతూ.. "మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. హారర్, కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు.
![]() |
![]() |