![]() |
![]() |

(డిసెంబర్ 17 `సహజ నటి` జయసుధ పుట్టినరోజు సందర్భంగా..)
నటిగా జయసుధది దాదాపు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించి.. `సహజ నటి`గా పేరు తెచ్చుకున్నారామె. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విభిన్న పాత్రలు చేసి మెప్పించారామె. పలువురు అగ్ర కథానాయకుల సరసన కనువిందు చేశారు. తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు పురస్కారాలను సొంతం చేసుకున్నారు. మరీముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం `నంది`.. 8 సార్లు ఆమె చెంత చేరింది. `ఉత్తమ నటి` విభాగంలో నాలుగు సార్లు, సపోర్టింగ్ యాక్ట్రస్ గా రెండు సార్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగంలో మరో రెండు నందులు ఆమె సొంతం చేసుకున్నారు.
కాగా, `ఉత్తమ నటి` విభాగంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు `నంది` పురస్కారాలు అందుకున్న ఏకైక కథానాయిక జయసుధనే కావడం విశేషం. `ప్రేమాభిషేకం` (1981), `మేఘ సందేశం` (1982), `ధర్మాత్ముడు` (1983) చిత్రాల్లోని తన అద్వితీయ నటనతో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. జయసుధ తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (భారతనారి (1989), కర్తవ్యం (1990)), లయ (మనోహరం (2000), ప్రేమించు (2001)) బ్యాక్ టు బ్యాక్ `నంది` అవార్డులను కైవసం చేసుకున్నప్పటికీ.. హ్యాట్రిక్ అయితే కొట్టలేకపోయారు. అలా.. `నంది` అవార్డుల విషయంలో `ఉత్తమ నటి`గా అరుదైన `హ్యాట్రిక్` కొట్టారు సహజ నటి జయసుధ.
![]() |
![]() |