![]() |
![]() |

అమితాబ్ బచ్చన్‌తో కలిసి టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే ఒక షూటింగ్‌లో పాల్గొంది. సెట్స్‌పై ఆయనతో కలిసున్న ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె ఆ క్షణాలను తన 'కల నిజమైన వేళ'గా పేర్కొంది. అమితాబ్ సరసన చైర్‌లో కూర్చొని హాయిగా నవ్వుతున్న పూజ, ఆ ఫొటోకు “The man. The legend. ఆయనతో షూటింగ్ చేయడం ఒక కల. ఎట్టకేలకు నా డ్రీమ్ లిస్ట్‌లో దానికి టిక్ కొట్టగలిగాను. తగినంత చెప్పేశాను. మరింత తెలుసుకోవడానికి ఎదురుచూస్తుండండి." అని రాసుకొచ్చింది.
అమితాబ్‌తో ఏ షూటింగ్‌లో తను పాల్గొన్నదనే విషయం పూజ వెల్లడించలేదు. మనకు తెలిసినంతవరకూ ఆ ఇద్దరూ కలిసి ఏ సినిమా చేయట్లేదు. బహుశా ఏదైనా యాడ్ షూట్ అని ఊహించవచ్చు.
ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను అందుకున్న పూజ, ఆ మైల్‌స్టోన్‌ను సాధించిన సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసుకుంది. పని విషయానికి వస్తే.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో యమజోరు మీద ఉందామె. వాటిలో ముందుగా ప్రభాస్ సరసన తొలిసారి నటించిన 'రాధే శ్యామ్' మూవీ 2022 జనవరి 14న విడుదలవుతోంది. ఆ తర్వాత రామ్‌చరణ్ జోడీగా నటించిన 'ఆచార్య' మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ కానున్నది. బాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌తో 'సర్కస్', సల్మాన్ ఖాన్‌తో 'భాయిజాన్', తమిళంలో విజయ్ సరసన 'బీస్ట్' సినిమాలు చేస్తోంది.
![]() |
![]() |