![]() |
![]() |

అందం, అభినయాల మేలి కలయిక.. కథానాయిక శ్రియా సరన్. దాదాపు రెండు దశాబ్దాలుగా నటిగా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. పెళ్ళయ్యాక కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తూ.. తన అభిమానులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. కేవలం నెల రోజుల్లో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది శ్రియ. ఆ చిత్రాలే.. `గమనం`, `ఆర్ ఆర్ ఆర్`. లేడీ డైరెక్టర్ సుజనా రావు రూపొందించిన ఆంథాలజీ ఫిల్మ్ `గమనం` డిసెంబర్ 10న రిలీజ్ కానుండగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్` 2022 జనవరి 7న విడుదల కానుంది. `గమనం`లో ఓ ప్రయోగాత్మక పాత్ర చేసిన శ్రియ.. `ఆర్ ఆర్ ఆర్`లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కి జంటగా కనిపించనుంది. మరి.. నెల లోపు రానున్న ఈ రెండు సినిమాలతో నటిగా శ్రియ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
కాగా, ఇళయరాజా సంగీతసారథ్యంలో రూపొందిన `గమనం`లో నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనుండగా.. `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు.
![]() |
![]() |