![]() |
![]() |

'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అఖండ'. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామని బాలయ్య, బోయపాటి ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించడం విశేషం. ఇటీవల కాలంలో తమన్ సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక సినిమాలకు ఆయనిచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే 'అఖండ' తనకు ఎంతో స్పెషల్ అని, తన బెస్ట్ వర్క్స్ లో అఖండ ఒకటని తమన్ అంటున్నారు. 'అఖండ' సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల
ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా తమన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
* గతంలో బాలకృష్ణ గారితో ఓ సినిమా, బోయపాటి గారితో ఓ సినిమా చేశా. కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో చేయడం వేరు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సూపర్. ఒక ఫైర్ ఉంటుంది. వాళ్ళ మధ్య అండర్ స్టాండింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళ కాంబినేషన్ లో వంద సినిమాలు వచ్చినా ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వదు.
* బోయపాటి రేసుగుర్రం లాంటి మనిషి. ఫుల్ ఎనర్జీ. ఆయన పరుగెడుతూ వర్క్ చేస్తారు. అందరినీ పరుగెత్తేలా చేస్తారు.
బీజీఎం కి చాలా స్పేస్ ఇచ్చారు బోయపాటి. మంచి ఔట్ పుట్ వచ్చింది. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది.
* ఈ సినిమాలో తక్కువ సాంగ్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ తో ఈ సినిమాకి అవసరమైన నాలుగు సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఐదు అనుకున్నాం.. కానీ కంపోజ్ చేసిన తర్వాత ఆ సాంగ్ అవసరంలేదు అనిపించి తీసేసాం. సాంగ్ తీసేసినందుకు నాకు బాధ అనిపించలేదు. ఏం చేసినా సినిమా కోసమే. సినిమాకి ఆ సాంగ్ అవసరంలేదు అనుకున్నప్పుడు తీసేయడంలో తప్పులేదు. ఫైనల్ గా సినిమా బాగుండటం ముఖ్యం.
* మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ రెండు మూడు నెలల క్రితమే అయిపోయింది. కోవిడ్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండటంతో.. ఇంకా బెటర్ మెంట్ చేశాం. బీజీఎం కోసం చాలా రీసెర్చ్ చేశాం. అఘోరాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ మూవీ కోసం ఎన్నో ఎక్స్పరిమెంట్స్ చేశాం. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాం. మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటిదాకా నా బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు.
* సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. 'నెవెర్ బిఫోర్ నెవెర్ అగైన్' అనే మాట ఈ మూవీకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. బోర్ కొట్టే సీన్స్ అసలు ఉండవు. అఘోరా ఎంట్రీ తర్వాత మూవీ వేరే లెవెల్ లో ఉంటుంది. మూవీలో అఘోరా సీన్స్ వచ్చినప్పుడు గుండెని జాగ్రత్తగా పెట్టుకోండి.
* టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడానికి నెలరోజులు పట్టింది. బాలకృష్ణ గారికి సాంగ్ బాగా నచ్చింది. ఆయన లవ్ లీ పర్సన్.
* ప్రస్తుతం నేను దేవిశ్రీప్రసాద్ కంటే నాలుగు అడుగులు ముందు ఉన్నాను అంటే అసలు ఒప్పుకోను. నేను ఈ నెంబర్ గేమ్ నమ్మను. నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తాను. మ్యాగ్జిమం ఎఫర్ట్స్ పెడతాను.
* ఒకప్పుడు సాంగ్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఇలా సింగిల్స్ విడుదల చేయడం వల్ల.. సినిమాలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రమోషన్ జరుగుతుంది. మ్యూజిక్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంది. 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత మ్యూజిక్ ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది.
* దాదాపు అందరు హీరోలతో వర్క్ చేశాను. ప్రభాస్ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నా. గతంలో 'రెబెల్' సినిమాకి వర్క్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల నేనే ఆ సినిమా నుంచి వాకౌట్ చేశాను. లారెన్స్ గారు ఏదో ఐడియా వచ్చిందని, మ్యూజిక్ చేస్తానని అన్నారు. అందుకే నేను ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను.
* 'సర్కారు వారి పాట' అప్డేట్ జనవరిలో రావొచ్చు. ఇప్పటికే ఆల్బమ్ కంప్లీట్ అయింది.
పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ పాడించాలి అనుకున్నది నిజమే.. చూద్దాం.
చిరంజీవి, సల్మాన్ ఖాన్ సాంగ్ గురించి ఆ సినిమా(గాడ్ ఫాదర్) అప్పుడు మాట్లాడుకుందాం.
![]() |
![]() |