![]() |
![]() |

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క్యాలీఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సంపూ గత చిత్రాలు 'హృదయకాలేయం', 'కొబ్బరిమట్ట' లను గుర్తు చేశాయి. 'మగాడిదీ శీలమేగా' అంటూ అత్యాచారానికి గురైన మగాడిలా సంపూ ఏడుస్తూ కనిపించిన ఓ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ లోనూ సంపూ తన మార్క్ రచ్చ చేశాడు.
సంపూ సినిమాల్లో కామెడీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. 'క్యాలీఫ్లవర్'లోనూ మగాడి శీలానికి రక్షణ ఏది? అంటూ తనదైన డిఫరెంట్ కామెడీతో అలరించబోతున్నాడు సంపూ. ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ లో పెదరాయుడు రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిన సంపూ.. "ఎనీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ క్యాలీఫ్లవర్" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి మెప్పించాడు. "మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం" అంటూ సినిమా ఉద్దేశం ఏంటో చెప్పేశాడు సంపూ. ఇక చివరిలో "చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది" అంటూ సంపూ ఆవేదనతో చెప్పిన డైలాగ్ తో ఈ టీజర్ ముగిసింది. టీజర్ ని చూస్తే ఇది పక్కా సంపూ మార్క్ సినిమా అని అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో సంపూ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ బ్యానర్లపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజ్వల్ క్రిష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |