![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలిచింది. వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సాంగ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఫ్యాన్స్.. లిరికల్ వీడియో కన్నుల పండుగగా ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'ఈ రాతలే' అంటూ సాగే 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని మొదట మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచుసారు. కానీ చెప్పిన టైంకి సాంగ్ విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అప్డేట్స్ సరిగా ఇవ్వరు, చెప్పిన టైంకి సాంగ్ రిలీజ్ చేయరు అంటూ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పై విరుచుకుపడ్డారు. అయితే కొద్ది గంటల ఆలస్యంగా విడుదలైన 'ఈ రాతలే' లిరికల్ వీడియోను చుసిన ఫ్యాన్స్.. తమ కోపాన్ని మర్చిపోయి మేకర్స్ పైనా, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ పైనా ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం అందించిన 'ఈ రాతలే' సాంగ్ ఆకట్టుకుంటోంది. యువన్ శంకర్ రాజా, హరిని తమ వాయిస్ తో మ్యాజిక్ చేశారు. ఇక యానిమేషన్ క్యారెక్టర్స్, విజువల్స్ తో డిజైన్ చేసిన లిరికల్ వీడియో కట్టిపడేస్తుంది. లిరికల్ వీడియోనే ఈ స్థాయిలో ఉండే మూవీ ఏ స్థాయిలో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. లిరికల్ వీడియోని ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో చూస్తూనే ఉన్నారు. దీంతో 'ఈ రాతలే' లిరికల్ వీడియోకి రికార్డు వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్ సాధించిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ముందు ముందు ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టించే అవకాశముంది.
![]() |
![]() |