![]() |
![]() |

విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'లైగర్' మూవీ లేటెస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్రారంభమైంది. విశేషమేమంటే ఈ షెడ్యూల్‌లో మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాల్గొంటున్నారు. యస్. 'లైగర్'లో టైసన్ స్టోరీకి కీలకమైన ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. టైసన్ చేస్తున్న క్యారెక్టర్ ఏమిటనేది అఫిషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా, విజయ్‌కు బాక్సింగ్ కోచ్‌గానో, లేదంటే బాక్సర్ అయిన విలన్‌గానో కనిపించనున్నారని ఊహించవచ్చు.
టైసన్‌తో ఉన్న పిక్చర్‌ను షేర్ చేసి ఆయనతో కలిసి నటించే అదృష్టం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు విజయ్. "ఈ మనిషి.. ప్రేమ. ప్రతి క్షణం నేను జ్ఞాపకాలను పదిలపర్చుకుంటున్నాను. ఈ క్షణం మాత్రం ఎప్పటికీ నాకు ప్రత్యేకమైంది. #Liger Vs The Legend.. When I came face to face with Iron
@MikeTyson " అని రాసుకొచ్చాడు. విజయ్ షేర్ చేసిన ఫొటోలో క్లోజప్‌లో టైసన్ నవ్వుతుంటే, ఆయన వెనుక నిల్చొని వున్న విజయ్ కూడా నవ్వులు చిందిస్తున్నాడు.
నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ కూడా ఇదే ఫొటోను షేర్ చేసి, "And then they met- face to face! Absolute fire. The Legend vs Liger . #Liger #USAscheduleBegins " అని వెల్లడించింది.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'లైగర్' మూవీలో అనన్యా పాండే హీరోయిన్. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై కరణ్ జోహార్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |