![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ భారీ మల్టీస్టారర్ 2022, జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే సమయంలో విడుదల కావాల్సిన పలు సినిమాలు 'ఆర్ఆర్ఆర్'కు దారి ఇస్తూ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' కూడా పోస్ట్ పోన్ కానుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మూవీ టీమ్ ఆ ప్రచారానికి చెక్ పెట్టింది.
'భీమ్లా నాయక్' సినిమాని సంక్రాంతి కానుకగా 2022, జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సరిగ్గా ఐదు రోజుల ముందు అంటే జనవరి 7న తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు 'ఆర్ఆర్ఆర్' టీమ్ ప్రకటించింది. మరోవైపు సంక్రాంతికి రావాల్సిన మహేష్ బాబు 'సర్కారు వారి పాట' కూడా ఏప్రిల్ కి వెళ్ళిపోయింది. దీంతో అదే బాటలో 'భీమ్లా నాయక్' విడుదల కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. భీమ్లా నాయక్ జనవరి 12నే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |