![]() |
![]() |

టాలీవుడ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. 'సింహా', 'లెజెండ్' సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

'సింహా', 'లెజెండ్'లో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. 'అఖండ' ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో అంతకుమించి ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఎప్పటిలాగానే బాలయ్యను ఎలా పవర్ ఫుల్ గా చూపించారు బోయపాటి. పంచె కట్టులో రైతుగా, కాషాయ దుస్తుల్లో త్రిశూలం పట్టుకొని అఖండగా బాలయ్య లుక్స్ ఆకట్టుకున్నాయి. ఎద్దుల బండి చక్రాల నడుమ పంచె కట్టులో బాలయ్య నడిచి వస్తున్న షాట్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ లుక్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'లెజెండ్'తో జగపతిబాబు విలన్ గా మారి.. సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేసి దూసుకుపోతున్నారు. ఇప్పుడు అఖండతో శ్రీకాంత్ కూడా ఆ స్థాయిలో సత్తా చాటుతారని ట్రైలర్ తోనే నమ్మకం కలుగుతుంది. మొత్తానికి 'సింహా', 'లెజెండ్' లకు ఏ మాత్రం తగ్గకుండా పక్కా బాలయ్య ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా 'అఖండ' అని ట్రైలర్ తోనే బోయపాటి చెప్పేశారు. యూట్యూబ్ లో అఖండ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం రికార్డ్ వ్యూస్, లైక్స్ తో ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.
'అఖండ' సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |