![]() |
![]() |

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి జనం బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే అలాంటి విషయాలపై మీడియా కూడా ఫోకస్ పెడుతుంటుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ పర్సనల్ విషయాలకైతే డిమాండ్ మరీ ఎక్కువ. ఇటీవల రామ్‌చరణ్ భార్య ఉపాసన ఒక మీడియా మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఒకరు అడిగిన ప్రశ్నకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని తనకు లేదని చెప్పింది.
ఆమె ఎప్పుడు మీడియాతో సమావేశం ఏర్పాటుచేసినా మీడియా పర్సన్స్ ఎక్కువగా పర్సనల్ క్వశ్చన్స్‌ను సంధించడం పరిపాటి. లేటెస్ట్ మీటింగ్‌లో ఆమె ఎదుర్కొన్న పర్సనల్ క్వశ్చన్.. "మీరెప్పుడు తల్లి కాబోతున్నారు?" అని.
"అది నా పర్సనల్ చాయిస్. ఒకవేళ నేను త్వరలో బేబి కావాలనుకుంటున్నానని చెబితే, ఇక దానిపైనే మీడియా ఫోకస్ పెడుతుంది. అలా కాకుండా, నేనింకా దానికి సిద్ధంగా లేనని చెబితే, అది కూడా వైరల్‌గా మారుతుంది. అందువల్ల, ఆ ప్రశ్నకు నేనస్సలు జవాబివ్వను. అది నా పర్సనల్ విషయం. దానికి ఎవరికీ ఆన్సర్ చెప్పాల్సిన పని నాకు లేదు" అని తేల్చి చెప్పింది.
అపోలో హాస్పిటల్స్‌కు చెందిన 'అపోలో లైఫ్' అనే విభాగానికి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఉపాసన, 'బి పాజిటివ్' అనే మ్యాగజైన్‌ను నడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమె మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.
![]() |
![]() |