![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భోళా శంకర్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ లాంచ్ ఘనంగా జరిగింది.
'భోళా శంకర్' సినిమా గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్స్ కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్ శంకర్, రైటర్ సత్యానంద్ కలిసి స్క్రిప్ట్ ను మేకర్స్ కి అందజేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి మొదలు కానుంది. మూవీ ఓపెనింగ్ సందర్భంగా 'కాస్ట్ అండ్ క్రూ'ని కూడా మూవీ టీమ్ ప్రకటించింది. ఆర్టిస్ట్ ల లిస్టులో హాట్ యాంకర్ రష్మి గౌతమ్ పేరు ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది.

17 మంది పేర్లతో ప్రకటించిన 'భోళా శంకర్' ఆర్టిస్ట్ ల లిస్టులో పలు ఆసక్తికరమైన పేర్లు ఉన్నాయి. ఆ లిస్టులో యాంకర్స్ శ్రీముఖి, రష్మిలతో పాటు బిత్తిరి సత్తి పేరు కూడా ఉంది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి.. వెండితెరపై పలు సినిమాల్లో నటించి కుర్రకారుకి మత్తు ఎక్కించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో అమ్మడికి ఛాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ మూవీలో రష్మిని దర్శకుడు మెహర్ రమేష్ ఎలా చూపిస్తాడోనని చర్చలు మొదలయ్యాయి. రష్మి ఎప్పటిలాగానే తన గ్లామర్ తో కవ్విస్తుందో లేక యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

![]() |
![]() |