![]() |
![]() |

రవితేజ టైటిల్ పాత్రధారిగా రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న 'ఖిలాడి' మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాతల ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 11న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. 'ప్లే స్మార్ట్' అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్.
రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన డైరెక్టర్ రమేశ్ వర్మ, "మీ అందరి కోసం రిలీజ్ డేట్ రివీల్ చేస్తున్నాం. 2022 ఫిబ్రవరి 11న 'ఖిలాడి'గా మాస్ మహారాజా వస్తున్నాడు" అని ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్‌లో కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న రవితేజ సిగార్ తాగుతూ కనిపిస్తున్నాడు. ఆయన సైతం ఆ పోస్టర్‌ను షేర్ చేసి, "2022 ఫిబ్రవరి 11న సినిమా హాళ్లలో కలుద్దాం. #Khiladi " అని ట్వీట్ చేశారు.

'క్రాక్' లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ తర్వాత రవితేజ, 'రాక్షసుడు' లాంటి సర్‌ప్రైజింగ్ హిట్ తర్వాత రమేశ్ వర్మ పనిచేస్తున్న సినిమా కావడంతో 'ఖిలాడి'పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు టీజర్, టైటిల్ సాంగ్, 'ఇష్టం' సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచాయి.
శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా, సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
![]() |
![]() |