![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' మూవీ ఘన విజయం సాధించడమే కాకుండా.. ఊరిని దత్తతు తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ ఊరిని దత్తతు తీసుకొని పాఠశాల నిర్మాణం, చెరువు తవ్వించడం, రోడ్లు వేయించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతాడు. అయితే ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ త్వరలోనే 'శ్రీమంతుడు' మూవీ టీమ్ తో కలిసి ఆ పాఠశాలను సందర్శిస్తానని చెప్పాడు.

సుభాష్ రెడ్డి అభివృద్ధి చేసిన పాఠశాలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఈ స్కూల్ నిర్మాణం గురించి తెలుసుకున్న మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీమంతుడు స్పూర్తితో స్కూల్ నిర్మాణం జరగడంపై మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. 'సుభాష్ రెడ్డి గారు మీరు రియల్ హీరో' అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా, త్వరలోనే శ్రీమంతుడు టీమ్ తో కలిసి ఈ స్కూల్ ను సందర్శిస్తానని మహేష్ అన్నారు.

![]() |
![]() |