![]() |
![]() |

ఇటీవల దివంగతుడైన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పిస్తూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ నోట్ రాశారు. అంతే కాదు, తన కుమార్తె సౌందర్యకు చెందిన హూట్ యాప్‌లో పెట్టిన ఓ ఆడియో లింక్‌ను కూడా షేర్ చేశారు. "నువ్వు లేవంటే నేను నమ్మను పునీత్. నీ ఆత్మ శాంతించుగాక మై చైల్డ్" అని ఆయన ట్వీట్ చేశారు. అయితే కూతురి యాప్‌ను ప్రమోట్ చేయడం కోసం ఆయన పునీత్‌కు శ్రద్ధాంజలి ఘటించడం పునీత్ ఫ్యాన్స్ చాలామందిని షాక్‌కు గురిచేసింది.
ఒకతను, "షాకయ్యాను. యాప్ ప్రమోషన్ కోసం మీలాంటి లెజెండ్ శ్రద్ధాంజలి మెసేజ్‌ను ఉపయోగంచకూడదు" అని కామెంట్ చేశాడు. మరొకతను, "ఇప్పడు హూట్ యాప్‌లో సంతాప సందేశాలు కూడా." అని కామెంట్ పెట్టాడు. తన కొత్త యాప్ ప్రమోషన్ కోసం పునీత్ రాజ్‌కుమార్ మృతిని ఉపయోగించుకుంటున్నందుకు పలువురు ఫ్యాన్స్ సౌందర్య రజనీకాంత్‌ను నిరసిస్తున్నారు. రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్‌ను మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని పలువురు ఆత్రుత వ్యక్తం చేశారు.
సందర్భవశాత్తూ, తను హీరోగా పరిచయమైన 'అప్పు' (2002) మూవీ సూపర్ హిట్టయ్యాక పునీత్ ఒక గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను అరేంజ్ చేశాడు. దానికి చీఫ్ గెస్ట్‌గా రజనీ వచ్చారు. తన స్పీచ్‌లో పునీత్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. "అప్పు (పునీత్)తో కలిసి సినిమా చూశాను. అతనింకా సింహం పిల్లేనని నేను అనుకున్నాను, కానీ అతను ఇప్పటికే గర్జించడం మొదలుపెట్టాడు. భవిష్యత్తులో అతను ఏమేం సాధిస్తాడో చూడాలని ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా. ఓపెనింగ్ ఫైట్, సాంగ్‌తో అతను అందరినీ స్టన్ చేశాడు. డాక్టర్ రాజ్‌కుమార్ కొడుకవడం వల్ల అతను మెప్పు పొందడం లేదు. అతను మెప్పు పొందుతోంది, తన సొంత టాలెంట్ వల్ల" అని ఆయన మాట్లాడారు.
46 సంవత్సరాల పునీత్ రాజ్‌కుమార్ లక్షలాది మంది అభిమానుల గుండెలను బద్దలు చేస్తూ అక్టోబర్ 29న హార్ట్ ఎటాక్‌కు గురై ఆకస్మికంగా మృతి చెందారు.
![]() |
![]() |