![]() |
![]() |

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. రూమర్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ విడుదలపై వచ్చిన రూమర్ కి రానా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రానా.. 'విరాట పర్వం'పై వచ్చే రూమర్స్ కి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నాడు. ఇటీవల 'డైరెక్టర్ తో గొడవ జరిగి విరాట పర్వం మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నాడని' న్యూస్ రాగా.. 'ఎవరు బ్రో నీకు చెప్పింది.. నీ సోది' అంటూ రానా కౌంటర్ ఇచ్చి ఆ రూమర్ కి చెక్ పెట్టాడు. ఇక తాజాగా 'లాంగ్వేజ్ ఇష్యూస్ వల్ల విరాట పర్వం థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది' అంటూ న్యూస్ వచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రానా.. 'దయచేసి ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ మీద నాకు జ్ఞానోదయం కలిగించండి. ఏమి టైమ్ పాస్ గాళ్ళు బ్రో మీరు' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'విరాట పర్వం' సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |