![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్(శంకర్ ప్రసాద్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి 30 మంది పేకాటరాయుళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిలో వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. గుత్తా సుమన్ తో కలిసి శంకర్ ప్రసాద్ ఈ పేకాట దందా నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శంకర్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉప్పర్ పల్లి కోర్టులో ఆయన్ని హాజరుపర్చారు.
మరోవైపు నాగశౌర్య తండ్రి తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకి బెయిల్ వస్తుందా? లేదా? అనేది కాసేపట్లో తెలిసే అవకాశముంది.
![]() |
![]() |