![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'భోళా శంకర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. హీరోయిన్ గా తమన్నా నటించనుందని ఎప్పటినుంచో న్యూస్ వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
'భోళా శంకర్' టీమ్ లోకి తమన్నాకు స్వాగతం చెబుతూ తాజాగా మేకర్స్ ట్వీట్ చేశారు. తమన్నా కూడా ఈ మూవీలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడం ఆనందంగా ఉందని తెలిపింది. కాగా గతంలో 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరు సరసన తమన్నా నటించిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ మూవీ ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను కూడా దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీ పూజా కార్యక్రమం నవంబర్ 11 న ఉదయం 7:45 కు జరగనుంది. అలాగే నవంబర్ 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
![]() |
![]() |