![]() |
![]() |

విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటిస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా 'అర్జున ఫల్గుణ'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జోహార్ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
"నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని" అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 65 సెకన్ల టీజర్ లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లను చూపించారు. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. మొత్తానికి టీజర్ ని బట్టి చూస్తుంటే శ్రీ విష్ణు మరోసారి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమనిపిస్తుంది.
ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
![]() |
![]() |