![]() |
![]() |

కాజల్ అగర్వాల్ ఇటీవలే తన మొదటి పెళ్లిరోజును ఆనందోత్సాహాలతో జరుపుకుంది. ఆ టైమ్‌లోనే ఆమె ప్రెగ్నెంట్ అనీ, భర్త గౌతమ్ కిచ్లుతో తొలి బిడ్డను కనబోతున్నదనే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల కాజల్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో ముచ్చటించింది. అందులో ప్రెగ్నెంట్ వదంతులపై స్పందించిన ఆమె, మాతృత్వం గురించి కూడా మాట్లాడింది. వదంతుల గురించి అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతానంటూ తప్పించుకుంది. అయితే, ఆ తర్వాత తన చెల్లెలు నిషా అగర్వాల్ గురించి మాట్లాడుతూ, ఆమె కొడుకులతో గడుపుతున్నప్పుడు తను తల్లిలా భావించుకున్నానని వెల్లడించింది.
నిషాకు ఇద్దరు కొడుకులనీ, వాళ్లతో ఒక అద్భుతమైన తల్లిగా నిషా వ్యవహరిస్తుండటం చూసి, కొన్నేసిసార్లు తనకు కూడా మాతృత్వాన్ని స్వీకరించాలని అనిపిస్తుంటుందనీ చెప్పింది కాజల్. "మాతృత్వమనేది నన్ను ఎగ్జయిటింగ్‌కు గురిచేస్తుంది. కానీ అదే సమయంలో అది నన్ను నెర్వస్‌కు కూడా గురిచేస్తుంది. నిషా లైఫ్ పిల్లలు పుట్టాక ఎలా మారిపోయిందో, ఎలా సంపూర్ణత్వాన్ని తను ఫీల్ అవుతుందో నేను చూశాను. మాతృత్వం అనేది ఒక వండర్‌ఫుల్ ఫీలింగ్ అని నేననుకుంటున్నాను" అని ఆమె తెలిపింది.
నిషా కొడుకులు ఇషాన్, కబీర్ తన జీవితంలోకి వచ్చాక, వాళ్లతో గడుపుతూ తల్లిలాగా ఫీల్ అవుతుంటానని కాజల్ వెల్లడించింది. అంతేకాదు, తన పెంపుడు కుక్కపిల్ల మియా కూడా తన బిడ్డలాగే అనిపిస్తుందని కూడా చెప్పింది. ఆ ముగ్గురితో గడుపుతూ తను, గౌతమ్ పేరెంట్స్‌లాగా భావిస్తుంటామంది కాజల్. "ఈ పిల్లలు నా జీవితంలోకి ఎంటర్ కాకముందు నా హృదయంలో నేనెప్పుడూ ఎరగని ఒక ఫీలింగ్‌ను వాళ్లు వచ్చాక ఫీలవుతున్నాను. నేను స్వయంగా తల్లినై ఒక బిడ్డకు జన్మనిచ్చాక, కచ్చితంగా ఈ ఎమోషన్ ఇంకా ఎక్కువవుతుందని నేననుకుంటున్నా" అని ఎమోషనల్‌గా చెప్పింది కాజల్.
![]() |
![]() |