![]() |
![]() |

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'లడకి'. ఇండో-చైనీస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ సినిమా హిందీ, చైనా భాషలలో విడుదల కానుంది. హిందీలో 'లడకి', చైనా లో 'డ్రాగన్ గర్ల్' టైటిల్ తో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించి, ఆర్జీవీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి 'లడకి' చిత్రం నివాళి. ఈ చిత్రానికి ఆర్జీవీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ట్ సీ మీడియా మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లడకి చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయిన పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆమె ట్రైలర్ లో లేడీ బ్రూస్ లీ ని తలపిస్తుంది.
.webp)
లడకి చిత్రం భారత దేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రం. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10 న విడుదల చేస్తున్నారు.
నవంబర్ 27న బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో 'లడకి: ది డ్రాగన్ గర్ల్' మొదటి పోస్టర్ ను విడుదల చేస్తారు. అలాగే చైనా లో ని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ గర్ల్ చిత్రం ప్రీమియర్ వేస్తారు. ఈ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు 'డ్రాగన్ గర్ల్' పేరుతో భారీ ప్రమోషన్ తో 20 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు.
![]() |
![]() |