![]() |
![]() |

కార్తీ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన 'ఖైదీ' మూవీ తమిళంలో ఎంత హిట్టయిందో, తెలుగులోనూ అంత హిట్టయింది. డైరెక్టర్‌గా ఇది లోకేశ్‌కు రెండో సినిమా మాత్రమే. అదివరకు అతను 'మానగరమ్' అనే మూవీని రూపొందించి ఆకట్టుకున్నాడు. 'ఖైదీ' మూవీ చూసిన ఆడియెన్స్ అయితే, దాన్ని లోకేశ్ తీసిన విధానం చూసి స్టన్నయిపోయారు. ఆ సినిమా తర్వాత లోకేశ్‌కు వెంటనే విజయ్‌తో 'మాస్టర్' మూవీని తీసే చాన్స్ లభించింది. ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్‌తో అతను 'విక్రమ్' మూవీని తీస్తున్నాడు. ఇటీవల 'ఖైదీ 2' మూవీని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ' జపాన్‌లో జపనీస్ భాషలో విడుదలకు రెడీ అవుతోంది.
అవును. నవంబర్ 19న 'ఖైదీ డిల్లీ' పేరుతో ఈ సినిమా జపాన్‌లో విడుదలవుతోంది. ఆ దేశంలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ కార్తీ ఫిల్మ్ ఇదే. కూతుర్ని కలవడానికి పెరోల్‌పై బయటకు వచ్చిన ఒక ఖైదీ, ఎలా గ్యాంగ్‌స్టర్స్ నుంచి కొంతమంది పోలీసులను కాపాడాడనే పాయింట్ చుట్టూ నడిచే ఈ మూవీలో కార్తీ, అర్జున్ దాస్, నరైన్ ప్రధాన పాత్రలు పోషించారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద బ్యానర్లపై ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సామ్ సి.ఎస్. మ్యూజిక్ ఎస్సెట్‌గా నిలిచాయి.
![]() |
![]() |