![]() |
![]() |

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా డేగల బాబ్జీ(బండ్ల గణేష్)ని పరిచయం చేశారు. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సినిమా అంతా బండ్ల గణేష్ ఒక్కడే కనిపిస్తాడని అర్థమవుతోంది. 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?' వంటి డైలాగులతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. బండ్ల గణేష్ వన్ మ్యాన్ షో, లైనస్ మార్క్ మ్యూజిక్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ.. "తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.
![]() |
![]() |