![]() |
![]() |

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం 'పుష్పక విమానం'. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ గోకుల్ పార్క్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీరు మా మీద చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇవాళ ఇక్కడున్నాం. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి. దర్శకుడు దామోదర చాలా టాలెంటెడ్ టెక్నీషియన్. చాలా కాలంగా తెలుసు. మాకొక మంచి సినిమా చేసి ఇచ్చాడు. ఆనంద్ ను చిట్టిలంక సుందర్ క్యారెక్టర్ లో ముందు ఊహించలేకపోయాను. కానీ అతను పర్మార్మ్ చేసి చూపించాడు. నటించడం ఒక్కటే కాదు ప్రొడక్షన్ లో, ప్రమోషన్ లో అన్నింట్లో తాను ఇన్వాల్వ్ అయి సూపర్ సినిమా తీసుకొచ్చాడు. శాన్వీ మేఘన, గీత్ సైని లకు హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. వాళ్లకు ఇంకా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని ఇండస్ట్రీని కోరుతున్నా. మీ అభిమానం ఎప్పుడూ కావాలని కోరుకుంటా. మీకు మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు చేయాలనేది ఒక్కటే నా జీవిత ఆశయం.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, నాన్న. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. ఆయన వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను. కానీ విజయ్ ఎప్పుడూ నాకు సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు. ఆ మాట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని నేను చేసిన చిత్రమిది. రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపు దృష్టి మరల్చకుండా సినిమా చూస్తారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ.. అప్పట్లో మనం జంధ్యాల గారి సినిమాలు చూసి ఎంత హాయిగా నవ్వుకునే వాళ్లమో ఈ పుష్పక విమానం సినిమా చూసి అంతే ఆనందిస్తాం. ఆనంద్ ఫెంటాస్టిక్ గా నటించాడు, హీరోయిన్స్ బాగా క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఈ సినిమాకు వాళ్ల డైలాగ్ లు, యాక్టింగ్ టైమింగ్ చాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అవసరం లేదని అనిపించింది. డైరెక్టర్ సూపర్బ్ మూవీ చేశారు. పుష్పక విమానం తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది. అన్నారు.
దర్శకుడు దామోదర మాట్లాడుతూ.. "పుష్పక విమానం సాంకేతికంగా, ఆర్టిస్టుల పర్మార్మెన్స్ పరంగా బలమైన సినిమా. హీరో క్యారెక్టర్ ను ఎంజాయ్ చేయాలంటే మా చిత్రానికి రండి. ఆనంద్ అంత బాగా నటించాడు. ఈ చిత్రంలో టెక్నీషియన్స్, నటీనటులు కథను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, ఇలా బాగుంటుంది అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. పుష్పక విమానం చూశాక విజయ్ లాగే ఆనంద్ కు కూడా లేడీ ఫ్యాన్స్ పెరుగుతారు" అన్నారు.
నిర్మాత విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ.. "మాతో కలిసి విజయ్ దేవరకొండ ఈ ప్రొడక్షన్ పెట్టింది యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికే. పుష్పక విమానం ఒక్కటే కాదు, ఈ బ్యానర్ నుంచి ఇలాంటి కొత్త తరహా చిత్రాలు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. పుష్పక విమానం మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆనంద్ పర్మార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది." అన్నారు.
![]() |
![]() |