![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'రైజ్ ఆఫ్ శ్యామ్' పేరుతో ఓ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది.
'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్ లిరికల్ వీడియోను శనివారం నాడు మేకర్స్ విడుదల చేశారు. రైటర్ లీడర్ గా ఎదిగిన వైనాన్ని ఈ సాంగ్ లో కళ్ళకి కట్టినట్టు చూపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణిల గాత్రం ఈ సాంగ్ ని మరింత పవర్ ఫుల్ గా మార్చింది. "ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే" వంటి పవర్ ఫుల్ లైన్స్ తో సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇక లిరికల్ వీడియోలో నాని లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందు రానుంది.
![]() |
![]() |