![]() |
![]() |

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఇటీవల పోలీసులు దాడిచేసి అక్కడ పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకున్న విషయం, వారి నుంచి లక్షల్లో నగదునూ, ఖరీదైన కార్లనూ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ఆ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నారని వెల్లడవడంతో సినీ వర్గాలు ఖంగుతిన్నాయి. ఆ ఫామ్‌హౌస్‌ను నాగశౌర్య తన ఆఫీసుగా కూడా ఉపయోగిస్తున్నాడని తెలిసింది. దానితో పాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న మరికొన్ని ఫామ్‌హౌస్‌లలో గుత్తా సుమన్ అనే వ్యక్తి పేకాట దందాలు నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది.
లేటెస్ట్‌గా ఆ ఫామ్‌హౌస్ లీజు అగ్రిమెంట్‌తో తమ ముందు హాజరుకావాలని శంకర్ ప్రసాద్‌ను నార్సింగి పోలీసులు నోటీసు ఇచ్చారు. అక్కడ ఆయనకు తెలిసే పేకాట దందా జరుగుతోందా? అనే కోణంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ను నాగశౌర్య పేరెంట్స్‌కు తాను ఐదేళ్ల లీజుకు ఇచ్చినట్లు దాని యజమాని వెల్లడించారు. ఒకవైపు తమ అవసరాలకు వాడుకుంటూనే, ప్రైవేట్ వ్యక్తులకు ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీలకు ఆ ఫామ్‌హౌస్‌ను నాగశౌర్య కుటుంబం రెంట్‌కు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గుత్తా సుమన్‌కు కూడా బర్త్‌డే పార్టీ నిమిత్తం రెంట్‌కు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు దాడిచేసినప్పుడు పట్టుబడిన పేకాటరాయుళ్లలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామభద్రయ్య కూడా ఉన్నారు.
నిందితుడు గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. విచారణ నిమిత్తం పోలీసులకు రెండు రోజుల కస్టడీకి అప్పగించింది.
![]() |
![]() |