![]() |
![]() |

విభిన్న సినిమాలతో మినిమన్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు అడివి శేష్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. తాజాగా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న అడివి శేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో జి. మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మేజర్ ఆన్ ఫిబ్రవరి 11' పేరుతో రిలీజ్ డేట్ తో పాటు.. షూట్ పూర్తయిందని తెలుపుతూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఫిబ్రవరి 11, 2022 న మేజర్ సినిమా థియేటర్స్ లో విడుదల కానుందని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు మేకర్స్.

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |