![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
నవంబర్ 6న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని తెలియజేస్తూ 'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను విదుదల చేశారు. ఈ పోస్టర్ లో చేతిలో సిగరెట్ పట్టుకుని, కుర్చీలో కూర్చొని ఉన్న నాని ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ సింగిల్ లో 'శ్యామ్' పవర్ ఫుల్ గా ఎదిగిన విధానాన్ని చూపించనున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో 'శ్యామ్ సింగ రాయ్'పై అంచనాలు ఏర్పడగా.. తాజా పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.
ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |