![]() |
![]() |

తెలుగునాట స్టార్స్ గా రాణించాక హిందీ చిత్ర పరిశ్రమలోనూ తమదైన ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంకుశం` (1989) రీమేక్ `ప్రతిబంధ్` (1990)తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆపై `ఆజ్ కా గుండారాజ్` (1992), `ద జెంటిల్ మేన్` (1994) చిత్రాలతో సందడి చేశారు. ఇక చిరు తనయుడు చరణ్ కూడా `జంజీర్` (తెలుగులో `తుఫాన్`)తో 2013లో హిందీనాట తొలి అడుగులు వేశారు. త్వరలో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`తో అక్కడి ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నారు.
ఇదిలా ఉంటే.. పెదనాన్న చిరు, అన్నయ్య చరణ్ బాటలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పయనించనున్నాడని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వరుణ్ తో ఓ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తోందని.. వచ్చే ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ప్రస్తుతం వరుణ్ చేతిలో `గని`, `ఎఫ్ 3` చిత్రాలున్నాయి. డిసెంబర్ 3న `గని` విడుదల కానుండగా.. ఫిబ్రవరి 25న `ఎఫ్ 3` రిలీజ్ కాబోతోంది. అలాగే `ఛలో`, `భీష్మ` చిత్రాల దర్శకుడు వెంకీ కుడుములతోనూ వరుణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
![]() |
![]() |