![]() |
![]() |

కన్నడ సినీ పరిశ్రమలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
46 సంవత్సరాల పునీత్ ఈ ఉదయం జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. పునీత్ హఠాత్మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ మూడో కుమారుడు. బాలనటుడిగా 13 సినిమాలు చేసిన పునీత్.. 2002లో అప్పూ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా ఇప్పటివరకు 30 పైగా సినిమాల్లో నటించిన ఆయన పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు. అభిమానులు ఆయనను ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు.
![]() |
![]() |