![]() |
![]() |

హిందీ, తెలుగు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది ఉత్తరాది భామ కియారా అద్వాని. `ఎమ్మెస్ ధోని: ద అన్ టోల్డ్ స్టోరీ` (2016), `కబీర్ సింగ్` (2019), `గుడ్ న్యూస్` (2019) చిత్రాలతో హిందీనాట .. `భరత్ అనే నేను` (2018)తో తెలుగునాట విజయాలు చూసిన కియారా.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందులో మూడు బాలీవుడ్ మూవీస్ కాగా.. మరొకటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్.
ఇదిలా ఉంటే.. కియారా తాజాగా ఓ బైలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ చిత్రం కోసం కథానాయికగా కియారా ఎంపికైందని టాక్. అంతేకాదు.. ఈ చిత్రం కోసం రూ.5 కోట్ల భారీ పారితోషికం అందుకోబోతుందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, కియారాకి ఇదే తొలి తమిళ చిత్రం కానుంది.
![]() |
![]() |