![]() |
![]() |

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. `కొత్త బంగారు లోకం` (2008) వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగేసిన శ్రీకాంత్.. ఆపై `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013)తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం `ముకుంద` (2014), `బ్రహ్మోత్సవం` (2016) రూపంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన శ్రీకాంత్.. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `నారప్ప`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో.. శ్రీకాంత్ అడ్డాల తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారట అడ్డాల. అంతేకాదు.. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం. అలాగే ఓ ప్రముఖ కథానాయకుడు ఇందులో అతిథి పాత్రలో నటించే అవకాశముందని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. అలాగే విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో విజయాలు చూసిన శ్రీకాంత్.. మెగాస్టార్ తోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
కాగా, చిరు తాజా చిత్రం `ఆచార్య` విడుదలకు సిద్ధమవగా.. `గాడ్ ఫాదర్` చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు.. `భోళా శంకర్`, `మెగా 154` త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి.
![]() |
![]() |