![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. హీరోగా ఆయన తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అలాగే 'జనసేన' పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు(అక్టోబర్ 11 న) జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా.. గతంలో తాను తీయాలనుకున్న 'సత్యాగ్రహి' సినిమాను గుర్తు చేసుకున్నారు పవన్.
పవన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 'జాని'. 2003 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత దర్శకుడిగా రెండో సినిమాగా 'సత్యాగ్రహి'ని అనౌన్స్ చేశారు పవన్. అయితే ఆ సినిమా ఆగిపోయింది. అయితే నేడు జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆ సినిమాను గుర్తు చేసుకున్నారు పవన్.
'లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జన్సీ కాలం నాటి ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకుని చేయాలనుకున్న పొలిటికల్ మూవీ ఇది. 2003లో ప్రారంభించిన ఈ సినిమాను.. నిజ జీవితంలో చేయడానికి నిలిపివేశాను. ఆ సినిమాలో నటించడం కన్నా.. నిజ జీవితంలో అలా ప్రవర్తించగలగడమే నాకు సంతృప్తినిస్తోంది' అంటూ పవన్ ట్వీట్ చేశారు.
అలాగే, జనసేన భావజాలంపై లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్.. జనసేన తరఫున ఆయనకు సెల్యూట్ చేశారు.
![]() |
![]() |