![]() |
![]() |

గతంలో ఎన్నడూ లేని విధంగా వాడి, వేడిగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ అనూహ్య విజయం సాధించి, ప్రధాన పదవుల్లో ఎక్కువవాటిని చేజిక్కించుకుంది. స్వయంగా విష్ణు ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘన విజయం సాధించి, నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. 8 మంది ఆఫీస్ బేరర్లలో ఆరుగురు విష్ణు ప్యానల్ మెంబర్స్ అయితే, ఇద్దరు మాత్రమే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మెంబర్స్ కావడం గమనార్హం.
విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందిన ఆఫీస్ బేరర్స్:
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - ప్రధాన కార్యదర్శి
శివబాలాజీ - కోశాధికారి
మాదాల రవి - ఉపాధ్యక్షుడు
పృథ్వీ - ఉపాధ్యక్షుడు
గౌతంరాజు - సంయుక్త కార్యదర్శి
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన ఆఫీస్ బేరర్స్:
శ్రీకాంత్ - కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు
ఉత్తేజ్ - సంయుక్త కార్యదర్శి
కాగా 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 10 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి, 8 మంది విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందారు.
![]() |
![]() |