![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేశ్, ఆ ప్యానల్ తరపున జనరల్ సెక్రటరీగా నిలిచిన జీవితకు మాత్రం వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. ఆమెకు కాకుండా విష్ణు ప్యానల్ తరపున నిల్చున్న రఘుబాబుకు ఓటేయాల్సిందిగా బహిరంగంగా పిలుపునిచ్చిన ఆయన, పంతం నెగ్గించుకున్నారు. జీవితపై రఘుబాబు 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించి, కొత్తగా కొలువుతీరనున్న 'మా' కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
నిజానికి ప్రకాశ్‌రాజ్ తరపున మొదట జనరల్ సెక్రటరీగా బండ్ల గణేశ్‌ను ప్రకటించారు. కానీ అధ్యక్ష పదవిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన జీవిత, అనూహ్యంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకొని, ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో చేరారు. దాంతో గణేశ్ స్థానంలో ఆమెను జనరల్ సెక్రటరీగా నిలబెట్టారు ప్రకాశ్‌రాజ్. గణేశ్‌ను అధికార ప్రతినిధిగా మార్చారు. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గణేశ్.. తాను ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించారు.
ఆ తర్వాత తన 'దేవుడు' పవన్ కల్యాణ్ సూచనతో నామినేషన్‌ను ఉపసంహరించుకుని, తిరిగి ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు పలికారు. కానీ జీవితపై తన వ్యతిరేకాభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. విష్ణు ప్యానల్‌లోని రఘుబాబును జనరల్ సెక్రటరీగా ఎన్నుకోమని బాహాటంగా పిలుపునిచ్చారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ పాంప్లెట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసి, ఆ ప్యానల్‌కు ఓటేయమని చెప్పిన ఆయన, ఆ పాంప్లెట్‌లోని జీవిత ముఖానికి మాత్రం మసిపూసేసి, ఆమెను కనిపించకుండా చేశారు. ఆమె ఓడిపోవాలని కంకణం కట్టారు.
ఇప్పుడు ఆయన అభిమతానికి తగ్గట్లే జీవిత ఓడిపోయి, రఘుబాబు గెలిచారు. దాంతో తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆయన ఫొటోను షేర్‌చేసిన గణేశ్, "కంగ్రాచ్యులేషన్స్ మై బ్రదర్" అని అభినందించారు.

![]() |
![]() |