![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నిన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసుకోగా.. నేడు మాత్రం ఒకరికొకరు షేక్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకున్నారు. దీంతో పాటు పోలింగ్ సందర్భంగా మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది. శివ బాలాజీ చేతిని హేమ కొరికారు.
శివ బాలాజీ చేతిని హేమ కొరికారన్న న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె శివ బాలాజీ చేతిని కొరుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై హేమ స్పందించారు. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్నప్పుడు శివబాలాజీ తన చేతిని తనకు అడ్డుగా పెట్టాడని ఆమె చెప్పారు. ఆయనను తప్పుకోవాలని కోరానని, అందుకు ఆయన ఒప్పుకోలేదని అందుకే తాను అతడి చేతిని కొరకాల్సి వచ్చిందని అన్నారు. ఎందుకు కొరికానో శివ బాలాజీనే అడగండని హేమ చెప్పారు.
ఈ వివాదంపై శివబాలాజీ కూడా స్పందించారు. ఈ విషయాన్ని ఆయన చాలా ఈజీగా తీసుకున్నారు. అంతా బావుందని, ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని శివ బాలాజీ తెలిపారు. హేమ, శివ బాలాజీ మాటలను బట్టి చూస్తే ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనుకున్నారు. అయితే తర్వాత హేమ కొరికిన చోట స్వెల్లింగ్ రావడంతో, చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు శివబాలాజీ. అక్కడ వైద్యులు ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసి, చేతికి కట్టుకట్టారు. టీటీ ఇంజక్షన్ చేసి పంపించారు.
![]() |
![]() |