![]() |
![]() |

'మా' ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఇటు మంచు విష్ణు, అటు ప్రకాశ్‌రాజ్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఈ క్రమంలో ఇరువురూ వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడడం మనం చూశాం. మొదట మెగా కాంపౌండ్ సపోర్ట్ లభించిన ప్రకాశ్‌రాజ్ గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయం కలిగింది. కానీ ఎన్నికల సమయం దగ్గరపడేసరికి సీన్ మారిపోయింది. మంచు విష్ణుకు గెలుపు అవకాశాలు పెరిగినట్లు అంతర్గత వర్గాలు చెబుతూ వచ్చాయి.
ఆదివారం సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నరేశ్, నాగబాబు, రామ్‌చరణ్, సుమన్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోజా, మంచు లక్ష్మి, మనోజ్, శివకృష్ణ, శివాజీ రాజా, రాశి, రాజీవ్ కనకాల, సుమ, ఆనంద్, శాంతి శ్రీహరి, యమున తదితరులు ఓటు వేశారు. ముంబై నుంచి జెనీలియా, ముఖేష్ రిషి లాంటి వారు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
'మా' ఎన్నికల్లో ఓటు వేయడానికి ముంబై నుంచి జెనీలియా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. విష్ణుకు ఆమె మంచి ఫ్రెండ్. నటీనటుల్లో తన స్నేహితులైన వారితో ప్రత్యేకంగా మాట్లాడి, వారు ఓటు హక్కు వినియోగించేలా విష్ణు చర్యలు తీసుకున్నాడు. పోలింగ్ ప్లేస్‌కు వచ్చిన జెనీలియాను విష్ణు స్వయంగా తోడ్కొని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లాడు. ఈ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని విష్ణు ఘంటాపథంగా చెబుతున్నాడు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |