![]() |
![]() |

ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూడో చిత్రం చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన ప్రీవియస్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడో సినిమాగా చేశాడు. కట్ చేస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో థర్డ్ జాయింట్ వెంచర్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. పవన్, బన్నీకి సంబంధించి మూడో సినిమాల విషయంలో ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యాడో దాన్నే మహేశ్ కి కూడా కొనసాగిస్తున్నాడు త్రివిక్రమ్. ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ తో త్రివిక్రమ్ చేసిన తొలి రెండు చిత్రాలు (`జల్సా`, `అత్తారింటికి దారేది`) దేవి శ్రీ ప్రసాద్ సంగీతసారథ్యంలో రూపొందితే.. మూడో సినిమా(అజ్ఞాతవాసి) మాత్రం అనిరుధ్ స్వరకల్పనలో తెరకెక్కింది. ఇక బన్నీ విషయానికొస్తే.. అతనితో త్రివిక్రమ్ చేసిన తొలి రెండు చిత్రాలకు (`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`) కూడా దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్. అయితే, మూడో సినిమా(అల వైకుంఠపురములో)కి మాత్రం తమన్ బాణీలు అందించాడు. ఇక మహేశ్ సంగతే తీసుకుంటే.. అతనితో త్రివిక్రమ్ చేసిన తొలి రెండు సినిమాలకు (`అతడు`, `ఖలేజా`) మణిశర్మ సంగీత దర్శకుడు కాగా.. రాబోయే మూడో చిత్రానికి తమన్ స్వరకర్త.
మొత్తమ్మీద.. పవన్, బన్నీ తరహాలోనే మహేశ్ తోనూ మూడో సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ పరంగా సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్.
![]() |
![]() |